దేవుని పడకల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్
తలకొండపల్లి, రంగారెడ్డి: మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో ఓపెన్ ప్లాట్లు, గ్రామంలో పల్ రహదారులు జెసిబి తో సర్పంచ్ అనిత మల్లేష్ క్లీన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకొని గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్లాట్స్ స్థలాలు, మట్టి రోడ్లను క్లీన్ చేయించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కానుగుల అనిత మల్లేష్, ఉప సర్పంచ్ అంబటి వెంకటేష్, ఒకటో వార్డ్ మెంబర్ స్వామి గౌడ్, పంచాయతి సెక్రటరీ నరేష్ గౌడ్, గ్రామస్తులు జిన్కుట్ల సత్యనారాయణ, యాదయ్య గౌడ్, అంబటి నరసింహ పాల్గొనడం జరిగింది.
- చప్పిడి తిరుపతి మేజర్ న్యూస్.