BREAKING
సంతా మా ఊరి సంత దసరా పండుగ వేళ కిటకిటలాడిన మేకల సంత ఆసుపత్రిలో ఎల్‌కే అద్వానీని పరామర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పాద సేవ ఢిల్లీలో నేడు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కాంగ్రెస్ పాలన రైతాంగానికి శాపం.. చల్మెడ లక్ష్మినరసింహా రావు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు రామయ్యగూడలో బతుకమ్మ సంబరాలకు ముస్తాబైన గ్రౌండ్‌.. ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్ రమేష్ కుమార్ యాంబూ వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ కూటమి కిరణ్ కుటుంబానికి రూ.44 వేల ఆర్థిక సాయం దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రి ఏడో రోజు శుభాకాంక్షలు కొత్తపల్లిలో ఉపాధి హామీ పనుల పరిశీలన పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గుజరాత్‌లో అమిత్ షా నవరాత్రి వేడుకలు సరస్వతి దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్లలో తగ్గుదల అవనాపు కుటుంబానికి దక్కిన గౌరవం

రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు నలుగురు ఎస్సైలు, 35 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

Select Suryaa Now
రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు  నలుగురు ఎస్సైలు, 35 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

 

రాయదుర్గం (రాయదుర్గం ఇన్చార్జి రాయదుర్గం) : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 35 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.

నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఒక అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే (వన్ ప్లస్ టూ విధానంలో) ఎన్నికల గదిలోకి వెళ్లాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ అర్బన్ సీఐ దేవానంద్, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, ఎన్నికల అధికారి సూర్యప్రతాప్ తదితరులు నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

 

రిపోర్టర్ : శివకుమార్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.