కిరణ్ కుటుంబానికి రూ.44 వేల ఆర్థిక సాయం
సూర్య, పెంచికల్పేట్:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామపంచాయతీకి చెందిన పాలే కిరణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామపెద్దలు, మిత్రులు అండగా నిలిచారు. కిరణ్ దినకర్మ నిర్వహణ కోసం దాదాపు 20 మంది కలిసి రూ.44 వేల ఆర్థిక సాయం సేకరించి, ఆయన తల్లి నాగమ్మకు అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.