చలో యాదగిరిగుట్ట
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి పిలుపు
చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25) :
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం, హక్కుల సాధన కోసం ఉద్యమకారులంతా ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రధాన అజెండాగా మార్చడంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఫోరం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల అంశాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చే ప్రక్రియలోనూ ఫోరం ముఖ్య భూమిక పోషించిందన్నారు.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్ (జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణం)లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, ఉద్యమాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రిపోర్టర్ : సున్నపు ప్రవీణ్