telanagana
భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న చెక్‌డ్యామ్!
సూర్య వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో చెక్‌డ్యామ్ నిండుకుండలా మారి చూపరులను ఆకట్టుకుంటోంది. చెక్‌డ్యామ్ నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి.
భారీ వర్షాలతో చెక్‌డ్యామ్‌లోకి నీరు చేరడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారూ.