హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్
హబ్సిగూడా ప్రధాన రహదారిపై జువెలరీ షాప్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు సుమారు 5వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు