మా స్థలంపై అసత్య ప్రచారాలు తగదు
మా స్థలం పై అసత్య ప్రచారాలు తగవు
- మాకు ఆధారాలు ఉన్న స్థలాన్నే మేము శుభ్రం చేసుకున్నాం
- మా పార్టీకి చెందిన నాయకులపై ద్సపచారం చేయడం తప్పు
- మాపై చేసిన ప్రచారాలకు పరువునష్టం దావా వేస్తాం
- మట్లి సహకార సొసైటీ చైర్మన్ అప్పలనేని నాగరాజ నాయుడు
రాయచోటి/ వీరబల్లి, మేజర్ న్యూస్;
మా స్థలానికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఆ స్థలాన్ని మేము ఇటీవల శుభ్రం చేసుకున్నాం. కానీ స్థలం మాది అని మా గ్రామానికి చెందిన తాండ్ర స్వామికొండ , ఆయన భార్య కళావతి ఇద్దరూ కొందరు వైసీపీకి చెందిన కార్యకర్తల ప్రోద్బలంతో ప్రతి రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. వీడియోలు తీసి వైసీపీకి చెందిన వారి సహకారంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుండడం మాకు మనో వేదనను కలిగిస్తోంది. అందులో మా పార్టీకి చెందిన నాయకుల పేర్లు కూడా వాడుకుంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై మేము పరువునష్టం దావా వేస్తాం...అని మట్లి సహకార సొసైటీ చైర్మన్ అప్పలనేని నాగరాజ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలో నేతాజీ కూడలి సమీపంలో అదే గ్రామానికి చెందిన గుదె వెంకట్రామ్ ప్రసాద్, యద్ధలపల్లి నంద కుమార్, సంతోష్, మరి కొందరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాగరాజ నాయుడు మాట్లాడుతూ మా స్వగ్రామం వీరబల్లి మండలం మట్లి పెద్దూరులో నంబా నాగభూషణం, నంబా నగేష్ లకు చెందిన స్థలాన్ని వారి దగ్గర మా తండ్రి వెంకటసుబ్బయ్య 2002 సంవత్సరంలో కొన్నారు. అప్పటి నుంచి స్థలం మా అధీనంలోనే ఉన్నది. ఇటీవల మా అన్నదమ్ములం మాకు చెందిన ఆస్తిని బాగా పరిష్కారాలు చేసుకోవాలని నిర్ణయించి పెద్ద మనుషుల సమక్షంలో స్థలాన్ని మాతమ్ముడు అప్పలనేని నాగార్జున కు నేను ఈ నెల 11 వ తేదీన రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాను. కానీ మా ఊరికి చెందిన తాండ్ర స్వామికొండ కుటుంబ సభ్యులు భూ వివాదం కారణంగా వారికి చెందిన ఆస్తులను కొన్ని ఏళ్లుగా బంజరు పెట్టుకున్నారు. తాండ్ర స్వామికొండ, ఆయన భార్య కళావతి ఇద్దరు గత కొన్ని రోజుల క్రితం మా ఇంటి దగ్గరకు వచ్చి మీ స్థలంలో కొద్ది రోజుకు చెత్త వేసుకుంటాం అని అడిగారు. మానవతా దృక్పథంతో మేము ఆలోచించి కొద్దిరోజులు వేసుకోండి అని చెప్పాము. ఇటీవల మా అన్నదమ్ములం బాగపరిష్కారం చేసుకునే క్రమంలో అక్కడ ఉన్న చెత్త దిబ్బను తీసివేయాలని తెలియజేయగా అలాగే తొలగిస్తాం అని భార్యాభర్తలు ఇద్దరు చెప్పారన్నారు. కానీ మాకు తెలియకుండా తాండ్ర స్వామికొండ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని తెలిసి మా స్థలంలో మేము శుభ్రం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
కానీ కొందరు వైసీపీ కి చెందిన కార్యకర్తల ప్రోద్బలంతో మాపై కేసు పెట్టడమే కాకుండా విడియోలు తీయించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా మా పార్టీకి చెందిన నాయకులపై కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారని, వారికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మాకు చెందిన స్థలంలో మేము శుభ్రం చేసుకోవడం తప్పా.., మానవతా దృక్పథంతో కొద్ది రోజులు చెత్త వేసుకోండి అని చెప్పడం తప్పా అని అడుగుతున్నానన్నారు. మాపై, మా నాయకులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తామని తెలిపారు.
అధికారులు సమగ్ర విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు.