BREAKING
ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు ఆమనగల్లులో అదనపు కోర్టు వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే!

ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

Select Suryaa Now
ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

పెరవలి మేజర్ న్యూస్ : తూ ర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని 199వ బూత్‌లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (చిన్న) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన అంత్యోదయ సిద్ధాంతం, ప్రజాసేవకు ఆయన చేసిన కృషిని నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన సిద్ధాంతాలు, సేవలు ఎంతో కీలకమైనవని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.