BREAKING
వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే! ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి.

Select Suryaa Now
పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి.

పట్టణాల కు ధీటుగా గ్రామసీమల అభివృద్ధి   --కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

--రూ 1.45 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు  మంత్రి పార్థసాధి శ్రీకారం

ఏలూరు/ ఆగిరిపల్లి, సెప్టెంబరు 25: ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి –విజయవాడ ప్రధాన రహదారి నుండి గొండపల్లి వరకు 2 కి.మీ. మేర రూ 95 లక్షలతో నిర్మించనున్న ఆర్&బి  బిటి రహదారి పనులకు, ఆగిరిపల్లి గ్రామంలోని యాదవులు మండపం నుండి మెట్లకోనేరు వరకు రూ 50 లక్షలు యంపి ల్యాండ్స్ నిధులతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శుక్రవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసాధి పాల్గొని భూమి పూజలుచేసి, శంఖుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. గ్రామ ప్రజలను పేరుపేరున పలకరించి గ్రామసమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు, మహిళలకు మంత్రికి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసాధి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, దశలు వారీగా మిగిలిన పనులు అన్నియు పూర్తిచేస్తామని అన్నారు. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ రోడ్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగుంటేనే ప్రజలు ఆరోగ్యజీవన విధానాలు మెరుగుపడతాయని, డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. నిర్మాణపనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులను మెరుగు పరచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా నిలిచిపోయి అశాంతి, కక్షసాధింపులు, అన్ని చోట్ల వేధింపులేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తోందని తెలిపారు.నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు ఆశయాలే తమ అభివృద్ధి అజెండా అని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి,సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని, నూజివీడు నియోజకవర్గం అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి  కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.