BREAKING
వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే! ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

అనకాపల్లిలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం

Select Suryaa Now
అనకాపల్లిలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం

అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయి – జిల్లా పరిషత్
అనకాపల్లిలో నూతనంగా ప్రారంభమైన జిల్లా పరిషత్ – ప్రజలకు మరింత చేరవకానున్న పాలన
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అదనపు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 25, మేజర్ న్యూస్:  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ,  బండారు సత్యనారాయణమూర్తి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మరియు ప్రజలకు  శుభ దినమని గతంలో ఉమ్మడి పరిధిలో సమావేశాలు జరగడం వల్ల జిల్లా సమస్యలపై చర్చించడానికి సమయం తక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో అనకాపల్లి సమస్యలన్నింటినీ వివరంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.   జిల్లాకు వచ్చే నిధులను పూర్తిగా అనకాపల్లి జిల్లా అభివృద్ధి పనులకే ఖర్చు చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.   జిల్లా పరిషత్‌కు సంబంధించిన ప్రతి ఒక్క అధికారి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించడానికి పూర్తీ స్థాయిలో సహకరించాలని కోరారు.  
ఈ సందర్భముగా  శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ  గతంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు సౌకర్యం లేక విశాఖపట్నం వెళ్లాల్సి రావడం వల్ల పాయకరావుపేట, మాడుగుల, నర్సీపట్నం తదితర ప్రాంతాల ప్రజాప్రతినిధులు (సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు) ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అనకాపల్లిలోనే జిల్లా పరిషత్ అందుబాటులోకి రావడం వారికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.  గతంలో  గెస్ట్ హౌస్‌గా నిర్మించిన భవనం, కాలక్రమేణా ఆర్డీవో కార్యాలయంగా మారి, ప్రస్తుతం అప్‌గ్రేడ్ అయ్యి జిల్లా పరిషత్ కార్యాలయంగా రూపాంతరం చెందిందని చెప్పారు.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఆస్తుల్లో 24 జెడ్పీటీసీలు ఉన్న అనకాపల్లి జిల్లాకు తగిన వాటా కేటాయించాలని  ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి లను ఉన్నత  అధికారులు కోరారని చెప్పారు.అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) కార్యాలయo ప్రారంభోత్సవ సందర్భంగా శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పాత భవనాలను తొలగించి, 4 అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించి అనుసంధానించాలని అన్నారు. ఇందులో జనరల్ బాడీ సమావేశ మందిరం, గెస్ట్ హౌస్‌లు మరియు ఇతర కార్యాలయాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని తెలిపారు.  శారదా నది ఒడ్డున జెడ్పీకి ఉన్న ఎకరం స్థలంలో పార్క్, గెస్ట్ హౌస్ నిర్మించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు.  రాష్ట్ర అభివృద్ధిలో ఇంజిన్‌గా అనకాపల్లి జిల్లా ఉండాలని ముఖ్యమంత్రి  మరియు ఉప ముఖ్యమంత్రి  నేతృత్వంలో ఈ జిల్లా అత్యధిక ఆదాయం, తలసరి ఆదాయం ఇచ్చే ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.  గ్రామీణాభివృద్ధి నిధులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో 15వ మరియు 16వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు, స్థానిక సంస్థలకు అందిస్తూ గ్రామాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారని తెలిపారు.   రహదారుల నిర్మాణం, పల్లె పథకం ద్వారా మొదటి విడతలో సుమారు 4,000 కి.మీ, రెండో విడతలో 6,000 కి.మీ రోడ్ల నిర్మాణం జరిగిందని, త్వరలోనే మూడో విడత కూడా ప్రారంభం కానుందని చెప్పారు.   ఈ జిల్లాను అగ్రగామి జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ భాగస్వాములై అనకాపల్లిని రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  జడ్పి సీఈవో నారాయణమూర్తి, అనకాపల్లి డిప్యూటీ సీఈవో ఇ.సందీప్, డిపిఓ మంజులవాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.