BREAKING
స్వర్ణ గ్రామ కార్యదర్శుల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు జిల్లా ఎస్పీ జగదీష్ అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’ స్విమ్మింగ్ పూల్‌లో పువ్వులతో విక్కీ కౌశల్ రొమాంటిక్ లుక్.. నెట్టింట ఫొటోలు వైరల్! భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ......

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం -రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం -రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

-అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

-, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలి

-చిన్నారులకు నాణ్యమైన విద్య, వికాసానికి కృషి చేయాలి

-విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల అర్బన్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల అర్బన్ పరిధిలోని పాన్ పట్టి ఏరియాలో ఉన్న 20 వ నెంబర్ అంగన్ వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అంగన్ వాడీ కేంద్రంలోని రిజిస్టర్లను, హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యత, పంపిణీ వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఒక్కరికీ పౌష్టికాహారం సక్రమంగా అందాలని, కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , ఎన్టీఆర్ షాది ఖానా చైర్మన్ అక్బర్ , రాజేష్ (బుజ్జి) , ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.