BREAKING
రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ

అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు

Select Suryaa Now
అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు

అన్న సమారాధన ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు
నరసాపురం, మేజర్ న్యూస్ :
పట్టణంలోని 6వ వార్డు కోవెల గుడి వద్ద ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ గణపతి నవరాత్రి 20వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు  కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు  ముఖ్య అతిథిగా విచ్చేశారు.
​ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,  కొవ్వలి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిఘ్నాలు తొలగించే వినాయకుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గత 20 సంవత్సరాలుగా కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో వార్షికోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
​ఈ కార్యక్రమంలో కొవ్వలి ఫాలోవర్స్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.