ప్రజా సమస్యలు వాటి పరిష్కారాలకు ప్రజా దర్భ వారిది
*ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు ప్రజా దర్బార్ వారధి...*
*వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*
ప్రజా సమస్యలు,వాటి పరిష్కారానికి ప్రజా దర్బార్ వారధిగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా మొత్తం 22 వినతులు అందాయి. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలు పరిష్కరించారు. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రతీ అర్జీ పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.