BREAKING
వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే! ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

టీడీపీ బలోపేతానికి చేయి చేయి కలుపుదాం

Select Suryaa Now
టీడీపీ బలోపేతానికి చేయి చేయి కలుపుదాం


 మజ్జి శ్రీనివాసరావుకు కర్రోతు బంగార్రాజు ఆత్మీయ స్వాగతం

 

 

 

భోగాపురం, సెప్టెంబర్ 25, (మేజర్ న్యూస్):

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఇటీవల టీడీపీలో చేరిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) శుక్రవారం బంగార్రాజును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బంగార్రాజు స్వగృహం వద్ద నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో బంగార్రాజు ఆత్మీయంగా మాట్లాడారు. “చేయి చేయి కలుపుదాం.. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం” అంటూ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సమావేశంలో ప్రసంగించారు. టీడీపీలోకి తనను ఆహ్వానించి ఆత్మీయంగా స్వాగతించిన బంగార్రాజుకు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బంగార్రాజుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చిన్న శ్రీనుకు శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, మాజీ జడ్పీటీసీలు పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, కడగల ఆనంద్‌కుమార్, పల్లె భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గేదెల రాజారావు, టౌన్ పార్టీ అధ్యక్షులు లెంక అప్పలనాయుడు, తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శి కర్రోతు రాజు, అధికార ప్రతినిధి నీలపు అప్పలరామిరెడ్డి, రాష్ట్ర డైరెక్టర్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.