BREAKING
వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే! ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం: ముగ్గురు నిందితుల అరెస్ట్, రెండు కార్లు స్వాధీనం

Select Suryaa Now
అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం: ముగ్గురు నిందితుల అరెస్ట్, రెండు కార్లు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం: ముగ్గురు నిందితుల అరెస్ట్, రెండు కార్లు స్వాధీనం
​కావలి మేజర్ న్యూస్ :
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న సుమారు రూ. 10 లక్షల విలువైన గంజాయిని కావలి గ్రామీణ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు అక్రమ తరలింపునకు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేశారు.
​స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను కావలి గ్రామీణ సీఐ గుడి రాజేశ్వరరావు, ఎస్ఐలు తిరుమలరెడ్డి, ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్లు  సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల తనిఖీలను గమనించిన దుండగులు బట్లదిన్నె అడ్డరోడ్డు మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా ఛేజ్ చేసి పట్టుకున్నారు.
​కార్లలో తనిఖీలు చేపట్టగా 46 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న 92 కిలోల గంజాయి లభ్యమైంది. అరెస్టయిన ముగ్గురు నిందితులలో ఒకరు తమిళనాడుకు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.