BREAKING
స్వర్ణ గ్రామ కార్యదర్శుల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు జిల్లా ఎస్పీ జగదీష్ అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’ స్విమ్మింగ్ పూల్‌లో పువ్వులతో విక్కీ కౌశల్ రొమాంటిక్ లుక్.. నెట్టింట ఫొటోలు వైరల్! భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ......

దావూద్ ఇబ్రహీం వ్యాపారాల కంటే భద్రతపైనే పాక్ ఐఎస్ఐ దృష్టి.. కరాచీ పోర్ట్ సమీపంలో పటిష్ట రక్షణ వలయం

Select Suryaa Now
దావూద్ ఇబ్రహీం వ్యాపారాల కంటే భద్రతపైనే పాక్ ఐఎస్ఐ దృష్టి.. కరాచీ పోర్ట్ సమీపంలో పటిష్ట రక్షణ వలయం

సూర్య అంతర్జాతీయ డెస్క్: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్, గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తన వ్యూహాన్ని మార్చినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో దావూద్ నిర్వహిస్తున్న చట్టవిరుద్ధ వ్యాపారాలు, డి-కంపెనీ ఆర్థిక కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించిన ఐఎస్ఐ, ఇప్పుడు అతడిని రక్షించుకోవడానికే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఒత్తిళ్లు, భద్రతాపరమైన ముప్పు పెరుగుతుండటంతో కరాచీ పోర్ట్ పరిసరాల్లోని అత్యంత సురక్షితమైన రహస్య నివాసంలో దావూద్‌కు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దావూద్ పాకిస్తాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడని దశాబ్దాలుగా భారత్ ఆధారాలతో సహా నిరూపిస్తున్నప్పటికీ ఆ దేశం నిరంతరం బుకాయిస్తూనే ఉంది. అయితే అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక నిఘా సంస్థల ఆంక్షలు, అంతర్గత ముప్పుల నేపథ్యంలో దావూద్ కదలికలను పాక్ సైన్యం, ఐఎస్ఐ పూర్తిగా పరిమితం చేసినట్లు తెలిసింది. కరాచీ రేవు సమీపంలోని నేవీ మరియు సాయుధ దళాల నిఘా విస్తృతంగా ఉండే ప్రాంతంలో ఆయనను ఉంచి అత్యాధునిక ఆయుధాలతో నిరంతర కాపలా కాస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాపార వ్యవహారాల కంటే దావూద్ ప్రాణాలకు ముప్పు కలగకుండా చూసుకోవడమే ఐఎస్ఐ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అతడికి ఏదైనా జరిగితే దశాబ్దాలుగా పాకిస్తాన్ దాచిపెడుతున్న ఉగ్రవాద సంబంధాలు, అక్రమ ఆర్థిక మూలాలు బట్టబయలవుతాయన్న ఆందోళనే ఈ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు కారణమని భావిస్తున్నారు.