బేతంచెర్ల పాఠశాలలో ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి
గూడూరు ప్రతినిధి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలోని జిపిఎస్ బేతంచెర్ల పాఠశాలలో బుధవారం రోజున ఎస్ ఆర్ శంకరన్ ఐఏఎస్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన వెంకన్న మాట్లాడుతూ ఎస్సార్ శంకరన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లా సరిగుత్తూరులో 1934 అక్టోబర్ లో జన్మించారని. అక్టోబర్ 2010 సంవత్సరములో మరణించడం జరిగింది ఎస్ ఆర్ శంకరన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మహనీయుడు కష్టపడి చదివేవారు శంకరన్ ప్రజలకు సేవ చేయాలనే తపనతో పట్టుదలతో 1957 సంవత్సరంలో ఐఏఎస్ కు ఎంపికయ్యారు ప్రజాసేవలో అంచలంచలుగా ఎదిగి ప్రజల మన్నులతో పాటు ప్రభుత్వ ప్రధాన అధికారులు మంత్రులు ప్రశంసలు అందుకున్నారు. శంకరన్ నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా కలెక్టర్ గా పనిచేసిన శంకరన్ సంచలనాత్మక వ్యక్తి ఆయన గిరిజన దళిత వర్గాల అభ్యున్నతికి కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన కార్యశీలి ఈయన బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి అని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రేగ సాంబయ్య విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.