BREAKING
ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఎం.ఎం.హళ్లిలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి

Select Suryaa Now
అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి

- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన మృతదేహం-

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై గత ఆదివారం మృతి చెందిన ఆర్మీ జవాన్ కిషన్ కుమార్ మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న జవాన్ తవాంగ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో అమరుడయ్యాడు. కిషన్ కుమార్ మృతదేహాన్ని అధికారులు ఇండిగో కార్గో విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల సమక్షంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం అమర జవాన్ కిషన్ కుమార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లా, పందిలపల్లి గ్రామానికి తరలించారు. అక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పోతుల నర్సింహా, శంషాబాద్ మేజర్ స్యూస్