BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

అనాథ చిన్నారులకు అండగా కిసాన్ బంధు.. ఉన్నత చదువులకు భరోసా

Select Suryaa Now
అనాథ చిన్నారులకు అండగా కిసాన్ బంధు.. ఉన్నత చదువులకు భరోసా

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్:

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన నలుగురు చిన్నారులకు కిసాన్ బంధు వ్యవస్థాపకులు స్నేహ, నిశాంత్, సతీష్ అండగా నిలిచారు. చిన్నారులకు పండుగ దుస్తులు అందించడంతోపాటు వారి విద్యాభ్యాసానికి సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. రవీందర్ గౌడ్ అన్నారు.దుద్యాల గ్రామానికి చెందిన నర్సిములు 2023లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, ఆయన భార్య పద్మమ్మ ఈ ఏడాది సెప్టెంబర్ 1న అనారోగ్యంతో మరణించారు. దీంతో వారి నలుగురు పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరిలో సుజన పదో తరగతి, కావ్యశ్రీ ఏడో తరగతి, అనన్య నాలుగో తరగతి చదువుతుండగా, శివప్రసాద్ యూకేజీలో విద్యనభ్యసిస్తున్నాడు.

చిన్నారుల పరిస్థితిని పి. రవీందర్ గౌడ్ కిసాన్ బంధు వ్యవస్థాపకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. శనివారం హైదరాబాద్ నుంచి దుద్యాల గ్రామానికి చేరుకుని చిన్నారులను పరామర్శించి, వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పండుగను సంతోషంగా జరుపుకునేందుకు కోస్గి పట్టణంలో రూ.7 వేల విలువైన నూతన దుస్తులను కొనుగోలు చేసి నలుగురు చిన్నారులకు అందజేశారు. తల్లిదండ్రులు లేరనే బాధతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

చదువుల బాధ్యత స్వీకరణ

చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కిసాన్ బంధు వ్యవస్థాపకురాలు స్నేహ, శివప్రసాద్ విద్యాభ్యాసానికి సంబంధించిన పూర్తి బాధ్యతను స్వీకరించారు. మిగతా ముగ్గురు చిన్నారుల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చుల బాధ్యతను కిసాన్ బంధు వ్యవస్థాపకుడు సతీష్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. రవీందర్ గౌడ్ తీసుకున్నారు. చిన్నారులు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడేలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనాథ చిన్నారులకు విద్య, ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన కిసాన్ బంధు ప్రతినిధులు, ఇతర సహకారదాతలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో దుద్యాల ఉపసర్పంచ్ సంజీవ్, పాఠశాల బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రమేష్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నీహారిక, కృష్ణకాంత్, కళ్యాణి, శశివర్ధన్, ఫరీద్‌తో పాటు ఇతర మిత్రులు పాల్గొని చిన్నారులకు మనోధైర్యాన్ని కల్పించారు.

రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.