BREAKING
శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

ఐపీఎల్ 2027 వేలంలో కుశాల్ మెండిస్.. పీఎస్‌ఎల్ జట్టుకు షాక్!

Select Suryaa Now
ఐపీఎల్ 2027 వేలంలో కుశాల్ మెండిస్.. పీఎస్‌ఎల్ జట్టుకు షాక్!

సూర్య స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ టీ20 లీగ్ కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 సీజన్ కోసం బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జల్మీ ఫ్రాంచైజీ అతడిని రీటైన్ చేసుకున్నప్పటికీ, కుశాల్ మెండిస్ మాత్రం ఐపీఎల్ 2027 మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. బీసీసీఐ ఫ్రాంచైజీలకు అందించిన ఆటగాళ్ల జాబితాలో మెండిస్ పేరు రూ. కోటి కనీస ధరతో చేరినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఒకే సమయంలో ఐపీఎల్ మరియు పీఎస్‌ఎల్ టోర్నీలు జరిగే అవకాశం ఉండటంతో, కుశాల్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.  

ఐపీఎల్ 2027 వేలంలో తనకు ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోతే, అప్పుడు పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలనే వ్యూహంతోనే కుశాల్ మెండిస్ ఈ అడుగు వేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం జరగనుండగా, అందులో మెండిస్‌కు మెరుగైన ధర లేదా అవకాశం లభిస్తే పీఎస్‌ఎల్ ఒప్పందాన్ని పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం పెషావర్ జల్మీ యాజమాన్యాన్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. తమ జట్టు ప్రణాళికల్లో భాగంగా మెండిస్‌ను అట్టిపెట్టుకున్నప్పటికీ, అతడు ఐపీఎల్ వైపు మొగ్గు చూపితే జట్టు సమతూకంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ ఫ్రాంచైజీ వర్గాలు భావిస్తున్నాయి.  

గత పీఎస్‌ఎల్ సీజన్‌లో కుశాల్ మెండిస్ అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 55 సగటుతో, 168.2 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 550 పరుగులు సాధించి, బాబర్ ఆజం తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు ఐపీఎల్‌లో మాత్రం అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా వచ్చి కేవలం ఒకే మ్యాచ్‌లో 20 పరుగులు చేశాడు, ఆ తర్వాత 2026 సీజన్‌కు ముందు ఆ జట్టు అతడిని విడుదల చేసింది.   ఐపీఎల్ 2027 మినీ వేలం కోసం మొత్తం 1220 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా, అందులో 281 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కుశాల్ మెండిస్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోతాడా, లేక తిరిగి పీఎస్‌ఎల్ 2027లో పెషావర్ జల్మీ తరఫున బరిలోకి దిగుతాడా అనేది డిసెంబర్ 16న జరిగే వేలం తర్వాతే స్పష్టత రానుంది.