BREAKING
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్ తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు శాండ్‌పేపర్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలుసు.. పాట్ కమిన్స్ తీరుపై మాజీ పేసర్ చాడ్ సేయర్స్ సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక ఆరు బంతుల్లో రెండు వికెట్లు.. ఐదో వన్డేలో న్యూజిలాండ్‌కు షాకిచ్చి రేసులోకి దూసుకొచ్చిన భారత్ కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే గురజాల కుటుంబం కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తండ్రి గిరిబాబు మరణంపై కన్నీరుమున్నీరైన రఘుబాబు.. స్వగ్రామం రావినూతలలో అంత్యక్రియలు కప్పట్రాళ్ల టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా సరస్వతి నామినేషన్

శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం

Select Suryaa Now
శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం

సూర్య స్పోర్ట్స్ డెస్క్: 2018 శాండ్‌పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణ తీరుపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఆనాటి ఘటనకు సంబంధించి తమకు పూర్తి సాక్ష్యాధారాలను ఎందుకు అందించలేదని, కీలక సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారని ఆయన నిలదీశారు. 2018లో తాము కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్రికెట్ ఆస్ట్రేలియా వద్ద ఉన్న అన్ని వివరాలు అంది ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేదని సోషల్ మీడియా వేదికగా వార్నర్ స్పష్టం చేశారు.

కేప్‌టౌన్ టెస్టులో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కిన తర్వాత, వైస్ కెప్టెన్ పదవి నుంచి వార్నర్ తప్పుకున్నారు. అనంతరం ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లపై 12 నెలల నిషేధం విధించడంతో పాటు, వార్నర్‌పై నాయకత్వ బాధ్యతల విషయంలో జీవితకాల నిషేధం వంటి తీవ్రమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ విచారణ మొత్తం తూతూమంత్రంగా సాగిందని, ఇది ఒక కవర్ అప్‌లా ఉందని వార్నర్ ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు.

ఆనాటి విచారణలో బౌలర్లను కూడా ప్రశ్నించారా లేదా అన్న విషయాన్ని తనకు ఎప్పుడూ చెప్పలేదని డేవిడ్ వార్నర్ పేర్కొన్నారు. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో వెల్లడించిన అంశాలకు తాను పూర్తి మద్దతుగా నిలుస్తున్నానని, ఆనాటి పరిస్థితులపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, శిక్షల నేపథ్యంలో విచారణ పారదర్శకతపై డేవిడ్ వార్నర్ లేవనెత్తిన ప్రశ్నలు అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.