కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే గురజాల కుటుంబం కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడు గురజాల నితీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మూషిక మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందించారు. కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్