ప్రముఖ సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం
పర్చూరు, మేజర్‌న్యూస్ :
ప్రముఖ సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన గిరిబాబు స్వయంకృషి, పట్టుదలతో సినీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.కింది స్థాయి నుంచి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన గిరిబాబు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని, ఒక గొప్ప కళాకారుడిని, ఆత్మీయుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిబాబు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష