కప్పట్రాళ్ల టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా సరస్వతి నామినేషన్
దేవనకొండ మండల ఫరిదిలోని కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా టీడీపీ నాయకులు మల్లికార్జున సతీమణి చింతమాను సరస్వతి ఆదివారం నామినేషన్ వేశారు.గత వారంలో జరిగిన యంపిటిసి ఎన్నికలలో మల్లికార్జున స్వల్ప మెజారిటీతో ఓటమి చెందారు.అయితే ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా నేడు మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా తన కుటుంబాన్ని నిలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమకు మద్దతుగా ఉన్నారని,ఉంటారని ధీమా వ్యక్తంచేశారు.కొందరు చేస్తున్న కుటిల రాజకీయాలను గ్రామ ప్రజలు గమణిస్తున్నారని కావున 26న జరిగే ఎన్నికలలో తన కుటుంబాన్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.