ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీ పరిధిలోని పొట్టిపల్లె, అక్కపల్లె గ్రామాలకు చెందిన దాదాపు 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బిజ్జం వెంకటరామిరెడ్డి, బిజ్జం రవీంద్రనాథ్ రెడ్డి, అనపా వీరశేఖర్, పంచాయతీ పార్టీ అధ్యక్షులు మరే శ్రీనివాసులు, పాశెం శివ, చెక్క లక్ష్మీనారాయణ, పెద్ద పుల్లయ్య తదితరుల సారథ్యంలో ఈ చేరికలు జరిగాయి. ముఖ్యంగా మాజీ రేషన్ డీలర్ దోణపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న ఆంజనేయులు, శ్రీనివాసులు, లక్ష్మయ్య, కానే చిన్న పామిలేటి, సారే ఓబులేసు, తుర్రా శంకర్, దాసరి రమణయ్య తదితరులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల ప్రముఖులు, కూటమి నాయకులు నాగార్జున, చెక్క పెద్ద పుల్లయ్య, బంధం వెంకట సుబ్బయ్య,ఏ. రంగనాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.