BREAKING
వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్ తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు శాండ్‌పేపర్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలుసు.. పాట్ కమిన్స్ తీరుపై మాజీ పేసర్ చాడ్ సేయర్స్ సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక ఆరు బంతుల్లో రెండు వికెట్లు.. ఐదో వన్డేలో న్యూజిలాండ్‌కు షాకిచ్చి రేసులోకి దూసుకొచ్చిన భారత్ కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే గురజాల కుటుంబం కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం

మార్టూరు, మేజర్‌న్యూస్‌ :

రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో సమష్టిగా పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో మార్టూరు, నాగులపాలెం, పర్చూరు, డేగర్లమూడి ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధత, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాది ఉందని, నాయకులంతా వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రజల మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.