వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన
వెల్దుర్తి, మేజర్ న్యూస్: ప్రజలకు ఏ సమయంలోనైనా తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని హ్యూమన్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఈదురు పద్మాకర్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఆయన తొలిసారిగా పర్యటించారు. స్థానిక కౌన్సిల్ జిల్లా కన్వీనర్ నాయకంటి సూర్యచంద్ర నివాసానికి విచ్చేసిన ఆయన్ను కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర కుమారుడు సుమంత్ గీసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని పద్మాకర్ పరిశీలించి అభినందించారు. ఉన్నత చదువులు చదివి మంచి అధికారిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు బోయ అన్నసూర్యుడు తదితరులు పాల్గొన్నారు.