అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు
గాజువాక, మేజర్‌న్యూస్ :
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు – 2024కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ మణిపూస, అంతర్జాతీయ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు తన ప్రతిభతో గుర్తింపు పొందిన జ్యోతి, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణ పతకాలు, ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడంతో పాటు 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడం గర్వకారణం. ఆమె పట్టుదల, కృషి, విజయాలు నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
-- పల్లా శ్రీనివాసరావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే