కన్య రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
కన్యా రాశి… వారం ప్రారంభంలో పనులు, ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. వారసత్వ ఆస్తులు, భూమి, దీర్ఘకాల పెట్టుబడులు, రుణ విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ, ఆధ్యాత్మిక ప్రయాణాలపై ఆసక్తి, ఖర్చులు, విరాళాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఆర్థిక విషయాలు, పెద్దల సహకారం, కుటుంబ వ్యవహారాలు, కమ్యూనికేషన్ అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. వ్యాపార ఆర్థిక వ్యవహారాలు ఆలస్యమైనా ముందుకు సాగుతాయి. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వారాంతంలో వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఆర్థికాభివృద్ధి, గుర్తింపు, గౌరవం పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.