యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కొత్త ఎండీఆర్ విధానంపై మధ్యంతర స్టేకు నిరాకరణ.. కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించిన కొత్త విధానంపై మధ్యంతర స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, యూపీఐ వాణిజ్య లావాదేవీలకు ఛార్జీలు విధించే విధానం, దాని ప్రాతిపదికపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జీల విధానం ఎలా రూపొందించారు? దానికి ఉన్న ఆధారం ఏమిటి? తదితర అంశాలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.