BREAKING
అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం

ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గణేష్ నాయక్‌.…

Select Suryaa Now
ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గణేష్ నాయక్‌.…

 - ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు…

కాంగ్రెస్ ఆదివాసి ఫరూక్నగర్ మండల అధ్యక్షునిగా గణేష్ నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . సోమవారం షాద్‌నగర్ క్యాంపు కార్యాలయంలో ఫరూఖ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పార్టీ గిరిజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులు శ్రీనునాయక్, రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పీఏసీస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. అనంతరం ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన గణేష్ నాయక్‌ను ఆదివాసీ కాంగ్రెస్ ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన గణేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు శక్రు నాయక్, పుల్చర్లకుంట సర్పంచ్ రాజు నాయక్, కడియాలకుంట మాజీ సర్పంచ్ రాజు నాయక్, వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ రమేష్ నాయక్, గుట్టతండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, అన్నారం మాజీ సర్పంచ్ బాలునాయక్, ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్, నెహ్రూ నాయక్, వెంకన్నగూడ తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, మున్నూరు రైతన్న గ్రామ మాజీ సర్పంచ్ రవి నాయక్, సుమన్ నాయక్, వేణు నాయక్, రాము నాయక్, తులసీరామ్ నాయక్, డాక్టర్ రవి నాయక్, సంజు నాయక్, కుమార్ నాయక్, దంతికుంట రాజు నాయక్, సంతోష్ నాయక్, సలవత్ సంతు నాయక్, దేవునిగుడి తండా మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, సుభాష్ నాయక్, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

-M. నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్ ఫరూక్ నగర్..