నేడు ఇజ్రాయెల్ ఎన్నికల సమరం
జెరూసలేం:అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన విధ్వంసకర దాడుల అనంతరం ఇజ్రాయెల్‌లో తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఏర్పాటైన 12,018 పోలింగ్ కేంద్రాల్లో 73 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మొత్తం 120 సీట్లు కలిగిన పార్లమెంట్ (Knesset)లో ఏ పార్టీ అయినా లేదా కూటమి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 సీట్ల మెజారిటీని సాధించాల్సి ఉంది.
ప్రస్తుత ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. అధికారంలో నిలదొక్కుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తుండగా, ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మాజీ సైనిక అధిపతి గాడీ ఐసెన్‌కాట్ మరియు మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌లు నెతన్యాహుకు ప్రధాన సవాల్ విసురుతూ ప్రచారంలో ముందంజలో నిలిచారు. యుద్ద పరిణామాలు, భద్రతాంశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు ఇజ్రాయెల్ భవిష్యత్తు రాజకీయాలను మలుపు తిప్పనున్నాయి.