కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్!
టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘చకోర - లూనార్ లవ్ బర్డ్’. శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన ఆయన, దర్శక నిర్మాతలకు తన శుభాకాంక్షలు అందజేశారు.
వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సమర్పణలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం ఉన్న మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అందమైన వైజాగ్ (విశాఖపట్నం) తీరప్రాంతం నేపథ్యంలో అత్యంత సహజంగా ఈ ప్రేమకథను తెరకెక్కించారు.
విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. "ఇది మామూలు ప్రేమ కథ కాదు... అమ్మ చెప్పిన ప్రేమ కథ, అబ్బాయి, అమ్మాయి ప్రేమల సమాహారం, ఇది చకోర ప్రేమ కథ" అంటూ సాగే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చకోర పక్షి స్వచ్ఛమైన వాన చినుకుల కోసం ఎంతగా ఎదురుచూస్తుందో, ఈ చిత్రంలో హీరో కూడా అంతే స్వచ్ఛమైన ప్రేమికుడిగా కనిపించనున్నారు. జాబిల్లిని చేరేందుకు ఆరాటపడే చకోర పక్షి స్పూర్తితో హీరో తన ప్రేయసి జూలీ కోసం సాగించే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.