BREAKING
ఏ ఈ ఆర్ ప్రణాళికపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ విశ్వకర్మలకు చేయూత.. పనిముట్ల పంపిణీ కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే: బండి సంజయ్ తీవ్ర విమర్శలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు, ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు పబ్బు రాజుగౌడ్‌ కుటుంబానికి పరామర్శ శ్రీ వాసవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల వీధి నాటక సందేశం. ఒంగోలు నియోజకవర్గంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు మంజూరు ,పత్రాల పంపిణీ చేసిన శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ ఇంటిపై సోలార్‌.. కరెంటు బిల్లుకు కోత. ,సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈ మల్లికార్జున్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం

ఫ్యామిలీస్ అంతా తప్పకుండా చూడాల్సిన సినిమా తెల్ల కాగితం.. సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్

Select Suryaa Now
ఫ్యామిలీస్ అంతా తప్పకుండా చూడాల్సిన సినిమా తెల్ల కాగితం.. సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తెల్ల కాగితం’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. హర్ష్ రోషన్ మరియు నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ తాజాగా ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు మరియు నటీనటులు సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ, ఒక మంచి సినిమాను రూపొందిస్తే ప్రేక్షకులు ఎంతటి అద్భుతమైన ప్రేమి ఇస్తారో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రీమియర్స్ ప్రదర్శించినప్పటి నుంచే సినిమాపై భారీ ప్రశంసలు వస్తున్నాయని, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలివచ్చి సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దర్శకుడు రమేష్, రైటర్ నందుతో పాటు సాంకేతిక నిపుణులు అందించిన సహకారంతోనే ఈ స్వచ్ఛమైన కథను ప్రేక్షకులకు విజయవంతంగా అందించగలిగామని తెలిపారు.

దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ, సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే రాత్రింబవళ్లు పడిన కష్టమంతా ఫలించిందని భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు స్వయంగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఇది నిలుస్తుందని, పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమాను విజయవంతం చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సినిమా మరిన్ని కేంద్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితం కానుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.