మాతృభూమి పాట కోసం రెండు రోజులు రిహార్సల్స్ చేసిన సల్మాన్ ఖాన్.. ఉదయం 10 గంటలకే సెట్‌కు హాజరు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం మాతృభూమి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు మదిరాపాన్ అనే పాట ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాట చిత్రీకరణ వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ తాజాగా పంచుకున్నారు. సాధారణంగా రిహార్సల్స్ చేయని సల్మాన్ ఈ పాట కోసం ఒకటి రెండు రోజులు రిహార్సల్స్ చేశారని, సినిమాపై ఆయన చూపిన అంకితభావం అందరినీ ఆశ్చర్యపరిచిందని ముదస్సర్ వెల్లడించారు.
మదిరాపాన్ పాట షూటింగ్ సమయంలో సల్మాన్ ఉదయం 10 గంటలకే సెట్‌కు రావడం అందరినీ విస్మయానికి గురి చేసిందని ముదస్సర్ ఖాన్ తెలిపారు. యూనిట్ సభ్యులంతా 10 గంటలకు సెట్‌లోకి అడుగుపెడుతుంటే, సల్మాన్ కూడా సరిగ్గా అదే సమయానికి వచ్చారని చెప్పారు. నాలుగైదు రోజుల పాటు సాగిన షూటింగ్‌లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని, ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ చిత్రీకరణ సజావుగా సాగేలా చూసుకున్నారని కొనియాడారు.
సాధారణంగా సల్మాన్ ఖాన్ నేరుగా షూటింగ్‌కు వచ్చి, అక్కడికక్కడే డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకుని చేస్తారని, కానీ మదిరాపాన్ పాట విషయంలో మాత్రం ఆ పద్ధతిని మార్చుకుని ఒకటి రెండు రోజులు రిహార్సల్స్ చేశారని ముదస్సర్ పేర్కొన్నారు. కేవలం హుక్ స్టెప్ సరిగ్గా రావడమే కాకుండా, ఇతర నటీనటుల ప్రదర్శన, డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్, మొత్తం లుక్ అన్నింటిపైనా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వివరించారు. ఈ పాట కోసం బోల్ట్ అనే హై-స్పీడ్ యాక్షన్ కెమెరా రిగ్‌ను ఉపయోగించామని, సల్మాన్ పాటల్లో దీన్ని ఇంత విస్తృతంగా వాడటం ఇదే తొలిసారేమోనని, ఈ ఆలోచనకు ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చారని తెలిపారు.
అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన చిత్రాంగద సింగ్ నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్ తమంగ్, అనూప్ బిక్రమ్ షాహి, అంకుర్ భాటియా, యశ్‌పాల్ శర్మ, జేసన్ థామ్, దయా శంకర్ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.