BREAKING
గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి అర్జున్ కపూర్‌తో సాహిబా బాలి గుర్‌పురబ్ పోస్ట్.. డేటింగ్ రూమర్లపై మరోసారి మంటలు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం... మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు

Select Suryaa Now
జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు

పార్వతీపురం, నవంబర్ 25 మేజర్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, పార్వతీపురం మన్యం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల క్రీడా మైదానం, డీఎస్ఏ ఇండోర్ స్టేడియం తదితర ఆరు క్రీడా వేదికల్లో పోటీలు జరిగాయి.

అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, బ్లైండ్ గోల్ బాల్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 88 మంది క్రీడాకారులు పాల్గొనగా, వారిలో 18 మంది మహిళలు, 70 మంది పురుషులు ఉన్నారు.

పోటీల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, గేమ్స్ సంఘం ప్రతినిధులు, స్థానిక క్రీడా ప్రతినిధులు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది పాల్గొని సహకరించారు. పోటీల నిర్వహణకు సహకరించిన వారందరికీ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డాక్టర్ కె. శ్రీధర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.