పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938.
సీతానగరం నవంబర్ 25 మేజర్ న్యూస్......మండల కేంద్రం లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి పువ్వల ధనంజయరావు మాట్లాడుతూ పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.
పార్వతీపురం జిల్లాలో గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో, ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఒకటి రెండు విడతలలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతం నుండి చాలా సుదూర ప్రాంతాలకు మహిళలని, రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారని చూడకుండా, వ్యాధులున్న వారిని పరిగణలోకి తీసుకోకుండా మ ఇష్టానుసారం వేస్తున్నారు. ఇలా చేయొద్దని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, పార్వతీపురం మన్యం జిల్లా శాఖ పక్షాన చాలాసార్లు రాతపూర్వకంగా అభ్యర్థనలను ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం వేయటం అనేది సరైన విధానం కాదు ఈ పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహించాల్సిన స్టేజ్ 1 . ఆర్వో స్టేజ్ 2 అధికారులను ఒక్క రోజు ముందు ఆర్డర్లు ఇవ్వడం శోచనీయమన్నారు.కనీసం ఈ తప్పిదాలను 2,3 విడతలకైనా సరిచేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా జరిగిన మునిసిపాలిటీ, జెడ్పిటిసి /ఎంపీటీసీ ఎన్నికలలో ఉపాధ్యాయులు/ అధ్యాపకులు/ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు క్రింద వివరిస్తున్నాము.తదుపరి జరగబోవు పంచాయతీ ఎన్నికలలో వీటిని పరిష్కరించ వలసినదిగా డిమాండ్ చేస్తున్నాము.అందరికీ ఎన్నికల విధులు ఉత్తర్వులు రాకముందే పోస్టల్ బ్యాలెట్ వేసుకునే తేదీని నిర్ణయించడం ఉద్యోగికి ఓటు హక్కును నిరాకరించడం జరిగింది. మన జిల్లాలో ఆర్డర్లు ఆలస్యమైన కారణంగా విజయనగరం జిల్లాలో ఓటు ఉన్న ఉపాధ్యాయులు ఓటు వేయలేకపోయారు.రాబోవు ఎన్నికల్లోనైనా దీన్ని సరిచేయాలని.
ఎన్నికల శిక్షణా కార్యక్రమం పిఓ/ఏపీవో లకు ఇచ్చారు. హెడ్ బుక్ పిఓలకు మాత్రమే ఇచ్చారు. ఏపీవో లకు కూడా ఇవ్వాలని.విద్యా శాఖకు చెందిన వారిని అధికంగా పిఓ/ఏపీవో లుగా నియమిస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ లో ఉన్న సిబ్బందిని ఓపివోలుగా నియమిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సీనియర్స్ అందరికీ కూడా ఆర్ ఓ. పిఓ. ఏపీవో లుగా నియమించాలన్ని డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్స్ కి ఓపిఓ లుగా నియమించాలనీ ఇటువంటి 23 అంశాలపై డిమాండ్ చేశారు.ఎన్నికల విధి నిర్వహణ కోసం ఉద్యోగి తన ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి రాకుండా జిల్లా ఎన్నికల సంఘం తగు జాగ్రత్తలు తీసుకొనేలా అన్ని మండలాల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేశారు. ఈ పత్రికా సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి పువ్వల కూర్మినాయుడు, సీతానగరం మండల శాఖ ప్రధాన కార్యదర్శి సల్ల సత్యం నాయుడు, బలిజిపేట మండల శాఖ కార్యవర్గ సభ్యులు బుడితి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు