'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్!
టాలీవుడ్‌లో పూర్తిగా సరికొత్త ట్రెండ్‌తో, నేటి జెన్ జెడ్ (Gen Z) యువత ఆలోచనలకు తగ్గట్టుగా తెరకెక్కుతున్న యూూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డెలులు’ (Delulu). క్రియేటివ్ లాంచ్ పాడ్ బ్యానర్‌పై ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్ లాంచ్ ఈవెంట్ వైభవంగా జరగగా, చిత్ర యూనిట్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది.
ఈ కార్యక్రమంలో హీరో విజయ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి అనుకున్నాను. ఆయన వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్నే పూర్తిగా మార్చేసింది" అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రేష్మిత్ ఎస్ కౌశిక కథ అందించగా, విజయ్ రాజ్‌కుమార్ డైలాగ్స్ రాశారు. జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ, ఆది చేబ్రోలు సంగీతం, హరికృష్ణ కూరపాటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జెన్ జెడ్ ట్రెండ్‌కు తగినట్లుగా సరికొత్త యూూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.