BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

రిషికాంత్ సినిమాలపై ప్రముఖ సింగర్ చిన్మయి ప్రశంసల జల్లు.. దైవికమైన ప్రతిభ అంటూ కొనియాడూ

Select Suryaa Now
రిషికాంత్ సినిమాలపై ప్రముఖ సింగర్ చిన్మయి ప్రశంసల జల్లు.. దైవికమైన ప్రతిభ అంటూ కొనియాడూ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినీ వర్గాలలో ప్రతిభావంతులైన నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న రిషికాంత్ నటనపై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ప్రశంసల జల్లు కురిపించారు. రిషికాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన డోరతి మరియు మోధ రాత్రి చిత్రాలను వీక్షించిన ఆమె, ఆ సినిమాల్లోని నటన ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్‌లు కేవలం సినిమాల్లా కాకుండా ఒక దైవికమైన అనుభూతిని కలిగిస్తాయని, చిత్ర యూనిట్ పనితీరు ఎంతో గొప్పగా ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.

యువ నటుడు రిషికాంత్ తన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని, ఆయన నటనలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తోందని చిన్మయి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కంటెంట్ ఆధారిత చిత్రాలకు వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. డోరతి చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు ఈ సినిమాలపై ప్రముఖుల నుంచి వస్తున్న సాజిటివ్ రెస్పాన్స్ చిత్ర యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

తెలుగు, తమిళ భాషలలో రాబోతున్న ఈ విభిన్న చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ఇలాంటి ప్రాజెక్ట్‌లు నటుడిగా రిషికాంత్ స్థాయిని మరింత పెంచుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మేకర్స్ మరింత వేగవంతం చేయడంతో సోషల్ మీడియాలోనూ ఈ ప్రాజెక్ట్‌‌లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.