BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

సింహాద్రి షూటింగ్ అనుభవాలు.. కేరళ అసెంబ్లీ వద్ద ఆ సీన్ చేయడం ఇప్పడు సాధ్యం కాదన్న రాజమౌళి

Select Suryaa Now
సింహాద్రి షూటింగ్ అనుభవాలు.. కేరళ అసెంబ్లీ వద్ద ఆ సీన్ చేయడం ఇప్పడు సాధ్యం కాదన్న రాజమౌళి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తన కెరీర్ ఆరంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం సింహాద్రి షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాము ప్రొడ్యూస్ చేస్తున్న తాజా చిత్రం ప్రమోషన్ల నేపథ్యంలో ఫహాద్ ఫాజిల్ మరియు ఇతర చిత్ర యూనిట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో రాజమౌళి పాల్గొని పలు జ్ఞాపకాలను నెరుకుతెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేరళ అసెంబ్లీ భవనం ఎదురుగా హీరో గొడ్డలి పట్టుకుని శత్రువులను తరుముకుంటూ వెళ్లే అత్యంత హింసాత్మక సన్నివేశాన్ని తాము షూట్ చేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ అలాంటి సీన్ తీయడం సాధ్యమవుతుందో లేదో తనకే సందేహంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

స్టూడెంట్ నంబర్ వన్ విజయం తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి చేసిన సింహాద్రి సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పిందని రాజమౌళి తెలిపారు. కథ ప్రకారం హీరో ఆంధ్రప్రదేశ్ దాటి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో తాము కేరళ నేపథ్యాన్ని ఎంచుకున్నామని, కేరళ అసెంబ్లీ ముందర దాదాపు పది రోజుల పాటు ఆ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు వెల్లడించారు. తన సినీ కెరీర్‌లో అంతటి హింసాత్మకమైన యాక్షన్ ఘట్టాన్ని ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెరకెక్కించలేదని, కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయతో పాటు అక్కడున్న వారు కూడా ఆ సీన్ తీవ్రతను గుర్తుచేశారు.

ఈ సందర్భంగా కేరళలో లొకేషన్ ఎంపిక వెనుక ఉన్న చిన్నపాటి చమత్కారాన్ని కూడా రాజమౌళి పంచుకున్నారు. సినిమాలో ఉపయోగించిన సింగమలై అనే పదం వాస్తవానికి తమిళ పదమైనప్పటికీ, అప్పట్లో ప్రజలకు తమిళం, మలయాళం మధ్య తేడాలు అంతగా తెలియవని భావించి దాన్ని అలాగే షూట్ చేశామని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను నూతన శిఖరాలకు చేర్చిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించగా, రాజమౌళి చెప్పిన ఈ షూటింగ్ విశేషాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.