యువతను వెంటాడుతున్న బ్రెయిన్ స్ట్రోక్ - ప్రతి నిమిషం కీలకం: డా. బాబూరావు చల్లపల్లి*
కర్నూలు రూరల్, మేజర్ న్యూస్ : ఒకప్పుడు వృద్ధుల్లోనే వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు 25-30 ఏళ్ల యువతను కూడా వెంటాడుతోందని కిమ్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. బాబూరావు చల్లపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం యువతలో స్ట్రోక్ కు ప్రధాన కారణాలని తెలిపారు.
స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం విలువైనదని, ప్రతి నిమిషం ఆలస్యం 19 లక్షల నాడీకణాలు దెబ్బతింటాయని, గంట ఆలస్యమైతే 11.4 కోట్ల కణాలు నశిస్తాయని వివరించారు.
BE FAST - Balance, Eyes, Face, Arm, Speech, Time లక్షణాలను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
మొదటి 4.5 గంటల్లో థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ద్వారా, 24 గంటల వరకు మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా ప్రాణాలను కాపాడి శాశ్వత వైకల్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.