విరబూసిన బ్రహ్మ కమలాలు
మేజర్ న్యూస్ ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ పరిధిలోని పలువుర గృహాల్లో ఆదివారం రాత్రి బ్రహ్మ కమలాలు విరబూసాయి. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే వికసించే ఆ బ్రహ్మ కమలాలను చూసి భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. ఆ పుష్పాలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్థానికంగా ఉండే ఆలయాల్లో సమర్పించి పూజలు నిర్వహించారు. ఠాణేలంక మొల్లి
గ్రామంలో శీలం లంకేశ్వరుడు ఇంటి వద్ద మొదటిసారి ఆదివారం రాత్రి వికసించిన బ్రహ్మ కమలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించడం జరిగింది. అలాగే బూరుగులంక గ్రామం లో దంగేటి సత్యనారాయణ ఇంటి వద్ద సుమారుగా మూడు సంవత్సరాల నుంచి మొదటిసారి 15 పువ్వులు, రెండోసారి 15 పువ్వులు మూడోసారి ఈ సంవత్సరం 18 పూలు వికసించడంతో గృహ యజమాని తో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలు ఆలయంలో సమర్పించడం జరిగింది. అలాగే నగర పంచాయతీ మట్టడి పాలెం
గ్రామానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు ఇంటి వద్ద సుమారు ఐదు పూలు ఒకే సమయంలో వికసించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి ఐదు పూలు రెండోసారి ఐదు పూలు ఈ సంవత్సరం విరబూసినట్లు ఆయన తెలియజేశారు. అలాగే ఠానేలంకలో పాత్రుని సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద బ్రహ్మకమలం ఓకే సమయంలో బ్రహ్మ కమలాలు వికసించడంతో ఆనంద పరవశలయ్యారు .