విక్టరీ లో బాలలు దినోత్సవం.
పాతపట్నం మేజర్ న్యూస్:
పిల్లలు ప్రేమపూర్వకంగా చాచా అని పిలుచుకునే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విక్టరీ పాఠశాలలో బాలల దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ముందుగా నెహ్రూ చిత్ర పటానికి నివాళులు అర్పించి, భాగ్యవంతుడైనా పండిట్ నెహ్రూ, దేశ విముక్తి కోసం స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని,ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని ప్రిన్సిపాల్ శంకర నారాయణ అన్నారు. పిల్లలు చిన్నతనం నుండే పెద్దలను గౌరవించడం, తోటివారితో మర్యాదగా నడుచుకోవడం,పరిసరాలను శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోవాలని ఏ వో శ్రీనివాస్ హితవు పలికారు. అనంతరం బాల, బాలికలు ప్రదర్శించిన వేషధారణలు, పాటలు,నృత్యాలు ఆహుతులను అలరించాయి. వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు డైరెక్టర్లు అప్పారావు , తారకేశ్వర రావు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.