BREAKING
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

విజయవంతంగా కొనసాగుతున్న పోషణ మాసో త్సవాలు :

Select Suryaa Now
విజయవంతంగా కొనసాగుతున్న పోషణ మాసో త్సవాలు :

 

అంగరంగ వైభవంగా పోషకాలపై స్టాల్ ప్రదర్శన :  

తె ర్లాం సెప్టెంబర్ 30 :  మేజర్ న్యూస్ : ఈనెల 9 వ తేదీ నుంచి ప్రారంభమైన పోషణ మాసో త్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం  తె ర్లాం  లోగల అంగన్వాడి కేంద్రం-3 లో జరిగిన పోషణ మాసోత్సవాలు తోపాటు అంగన్వాడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  బాడంగి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని ఎల్. సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషక పదార్థాలు పోషకాలు పై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. పప్పు దినుసులు కాయగూరలు పోషకాలు వంటి పదార్థాలను ఏర్పాటు చేసి గర్భిణీలకు బాలింతలకు తల్లులకు అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నారులకు పోషక పదార్థాలను ప్రోటీన్ వంటి పోషకాలను అందించాలని వారికి సంపూర్ణ ఆరోగ్యం కలిగేలా ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి తల్లి తెలుసుకోవలసినది బలమైన ఆహారం పుట్టిన శిశువుకు అందించి  తన ఆరోగ్యకరంగా ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలని ఆమె మరోసారి సూచించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల ద్వారా అందిస్తున్న పోషణ అభియాన్ పథకాన్ని బాలామృతం సద్విని చేసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు ఆటపాటలతో వారికి సరైన రీతిలో సేవలు అందించాలని అంగన్వాడి కార్యకర్తలకు ఆదేశించారు. క్రమం తప్పకుండా గర్భిణీలు బాలింతలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే తమ పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించేలా వారు అవుతారనీ ఆమె భావించారు. అదేవిధంగా సెక్టార్ సూపర్వైజర్ ఎస్. ఈశ్వరమ్మ పలు రకాల సూచనలు సలహాలు అందించారు కార్యక్రమంలో వారితోపాటు కార్యకర్తలు వై శ్రీదేవి  వి .సింహాచలం జి .లక్ష్మి విజయ  సునీత  దీప పలు కేంద్రాల కార్యకర్తలు గర్భిణీలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు.