క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
- ఉత్సాహంగా సాగిన పోటీలు - పాల్గొన్న వివిధ కళాశాలల క్రీడాకారులు సూర్య, ఒంగోలు :
ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తాచాటాయి. దాదాపు 10 టీమ్ లు పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో ఏకేవీకే కళాశాల జట్టు, ప్రకాశం కాలేజి జట్టు ఫేనల్స్ కి చేరుకోగా... వారితో ఏకేవీకే కళాశాల జట్టు విజేతగా నిలిచింది. అంతకుముందు పోటీలను క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.వి. హనుమంతరావు ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలకు క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ నిడమానూరి శ్రీ గాయత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్విస్ యాజమాన్యం ఈ తరహా పోటీలను నిర్వహిస్తుందని వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్విస్ ఇంజనీరింగ్ కళాశాల పీడీలు, కోచ్ లు, తదితరులు పాల్గొన్నారు.