BREAKING
పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం పెనమలూరులో ఆపదలో అండగా బోడే ప్రసాద్

టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి

Select Suryaa Now
టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి

యువతే ప్రత్యామ్నాయం.. ఉత్తరాంధ్ర నుంచే పాదయాత్ర

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు.. 66 శాతం పదవులు యువతకే

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. అమరావతే రాజధాని

విశాఖపట్నం, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్:
టీడీపీ, వైసీపీ కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా యువతను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన రాజకీయ ప్రస్థానంతో ఉత్తరాంధ్రకు ప్రత్యేక అనుబంధం ఉందని, యువతను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో తన పాదయాత్రను ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లను ప్రత్యేక అభివృద్ధి నిధిగా కేటాయిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో సాగు, తాగునీరు, రహదారులు, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. ఉత్తరాంధ్రలోని వలసలను అరికట్టేందుకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొస్తామని చెప్పారు.

600 టీఎంసీల నీటిని ఉత్తరాంధ్రకు
ఉత్తరాంధ్ర నదులు, జలాశయాలను అనుసంధానం చేసి గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలిసే నీటిలో 600 టీఎంసీలను ఈ ప్రాంతానికి మళ్లించడమే లక్ష్యమన్నారు. వంశధార, నాగావళి, జంపావతి, గోముఖి, వేగావతి, సువర్ణముఖి, శారదా నదుల అభివృద్ధితో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కిడ్నీ సమస్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అమరావతే రాజధాని.. విశాఖకు ప్రత్యేక ప్రాధాన్యం
అమరావతి రాజధానిపై పునరాలోచన చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పటికే రాజధాని కోసం భారీగా నిధులు ఖర్చు చేసినందున మళ్లీ రాజధాని మార్పు పేరుతో ప్రజలపై భారం మోపవద్దని సూచించారు. అదే సమయంలో విశాఖపట్నానికి అపారమైన ఆర్థిక సామర్థ్యం ఉందని, దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రాజధానుల హామీ విషయంలో వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇప్పటికీ రాలేదని విజయసాయిరెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాడతామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మూతపడిన చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించి, రైతులకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

యువతకు 66 శాతం ప్రాధాన్యం
తమ పార్టీ రాజకీయ పదవుల్లో 66 శాతం యువతకు ప్రాధాన్యం ఇస్తుందని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అందులో 33 శాతం యువతులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు యువతరం నుంచే రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గీతం భూములపై ప్రశ్నలు
గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల కేటాయింపుపై విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. భూముల విలువపై వివిధ వ్యాఖ్యలు వస్తున్నాయని, ప్రభుత్వం ఎంత మొత్తాన్ని తీసుకుని భూములు కేటాయించిందో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

ఆదివాసీల హక్కులకు రక్షణ
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్‌ను నియంత్రించడం, గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడం, గిరిజన సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడతామని చెప్పారు. ఆదివాసీల తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీడీపీ, వైసీపీలపై విమర్శలు
ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఉత్తరాంధ్ర–రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీలు కేంద్రంపై తగిన ఒత్తిడి చేయడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలూ రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర నుంచే రాజకీయ యాత్ర
యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రb నుంచే పాదయాత్ర ప్రారంభించి యువతను చైతన్యపరుస్తానన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.