BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటిన మంజుల, మౌనిక..

Select Suryaa Now
రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు  ప్రతిభ చాటిన మంజుల, మౌనిక..

రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు

ప్రతిభ చాటిన మంజుల, మౌనిక..


వల్లూరు మేజర్ న్యూస్

వల్లూరు మండలం గంగాయపల్లిలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ అండ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. కడప క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–17 బాలికల ఎంపిక పోటీల్లో గంగాయపల్లి పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ అండ్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు జె. మంజుల, మౌనిక ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న జె. మంజుల, బైపీసీ చదువుతున్న మౌనిక ఈ ఘనత సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు హర్షం వ్యక్తం చేసి విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయురాలు సుశీలమ్మ విద్యార్థినులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచి కళాశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు..