అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్:,ఆత్మకూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా పండుగ వాతావరణం లో నిర్వహించారు.ఐసిడిఎస్ జిల్లా పిడి నాగ శైలజ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పి.సునీలత పర్యవేక్షణలో స్థానిక అరుంధతియవాడ, బీసీ కాలనీ, వెస్ట్ హరిజనవాడ అంగన్వాడీ కేంద్రాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు టి. సునీత, డి. పద్మావతి, జి. సుప్రజ లు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా అలంకరించి ఆ పరిధిలోని ముఖ్యలను ఆహ్వానించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను అందరికీ వివరించి తగిన అవగాహన కల్పించారు. పౌష్టికాహారం ఆవశ్యకత తద్వారా లభించే ఆరోగ్యం గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య లభిస్తుందని తద్వారా వారు పాఠశాలలో చేరినప్పుడు తర్ఫీదు పొందిన విద్యార్థులు లాగా ఉండగలరని వారు పేర్కొన్నారు. అంగన్వాడి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి తగిన పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య పొందేలా చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు టి.సునీత, డి. పద్మావతి,జి.సుప్రజ, పలువురు గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.