BREAKING
నిద్రలేమి మనుషులను ఎంతలా దెబ్బతీస్తుంది? ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ప్రతిరోజూ నడక ఎంత ముఖ్యం? వ్యాయామం చేయలేని వారికి వాకింగ్ ఎందుకు అద్భుతమైన అలవాటు? టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటిన మంజుల, మౌనిక.. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసు: ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ అక్టోబర్ 6కి వాయిదా అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగి కుమారుడికి - ఉద్యోగం కల్పించాలని - జెఎండీకి వినతి సురేంద్రబాబు కుటుంబానికి మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని - విజ్ఞప్తి మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్

పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి

Select Suryaa Now
పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి

పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి

గోనెగండ్ల, సెప్టెంబరు 30:
పొలం వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గోనెగండ్ల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోనెగండ్ల లక్ష్మీపేట కాలనీకి చెందిన కురవ రంగడు అలియాస్‌ రంగముని (40), తన సోదరుడు వెంకటేశ్‌తో కలిసి ఐరన్‌బండ గ్రామ సమీపంలోని పొలంలో ఎరువుల మందు కలుపుతున్నారు.
అదే సమయంలో అదే పొలంలోని రస్తాలో భానుచందర్‌, వెంకట్రముడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వాహనం తార్పాలిన్‌పై నుంచి వెళ్లడంతో అది చినిగిపోయి ఎరువుల మందు కిందపడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భానుచందర్‌ పొలంలో ఉన్న ఇనుప చెలకతో రంగడు ఛాతిపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా నొప్పి రావడంతో రంగడు ఇంటికి చేరుకున్నాడు. నొప్పి ఎక్కువ కావడంతో చికిత్స కోసం ఎమ్మిగనూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

మృతదేహంతో బంధువుల ఆందోళన

రంగడు మృతితో ఆగ్రహించిన బంధువులు నిందితులను తమ ముందు హాజరుపరిచి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గోనెగండ్ల వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బంధువులను శాంతింపజేశారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.