పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ.
బాపులపాడు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్.
పల్లె పండుగ–3.0లో భాగంగా బాపులపాడు మండలంలో రూ.4.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ, బీటీ రహదారి పనులకు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు.కోడూరుపాడు–శోభనాద్రిపురం పరిధిలో రూ.1.80 కోట్లు, బాపులపాడు టౌన్, మడిచర్ల, కొయ్యూరు, సింగన్నగూడెం ప్రాంతాల్లో రూ.1.27 కోట్లు, బిల్లనపల్లి రహదారి నిర్మాణానికి రూ.1.38 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని యార్లగడ్డ విమర్శించారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.అలాగే నియోజకవర్గ యువతకు కృత్రిమ మేధ, యంత్ర అభ్యాసం, అర్ధవాహక రంగాల్లో ఉచిత శిక్షణ అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు